త్వరలో ప్రారంభం కానున్న నాని కొత్త సినిమా..

nani-Raghavapudi
‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో నాని హీరోగా తెరకేక్కబోయే సినిమా పూజా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. హను రాఘవపూడి చెప్పిన కథకు నాని ఓకే చెప్పారు. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరి 10న విడుదల చేయనున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

దర్శకుడు మారుతితో మరో సినిమా చర్చల దశలో ఉంది. నాని నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సొంతం చేసుకోకపోవడంతో కొత్త సినిమాలపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు.

Exit mobile version