
‘టెంపర్’ చిత్రం లోని యెన్. టి ఆర్ చిత్రాలు రిలీజ్ చేసినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటివలే విడుదలైన టిజర్ కి అభిమానుల దగ్గరనుంచి మంచి స్పందన లభిస్తుంది. యు ట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో అయ్యింది. ఈ చిత్రం ఆడియో ఈ నెల 18న విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెటిలైట్ హక్కులు ఒక ప్రముఖ టి.వి చానల్ కి 7.75 కోట్లకి అమ్ముడయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రం లో కాజల్ యెన్. టి ఆర్ సరసన ‘భాద్షా’ తర్వాత నటిస్తుంది . అనుప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.