ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు.

Rajendra-Prasd

ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్ర ప్రసాద్ నేడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ ఇషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ప్రముఖ హీరో జగపతి బాబు ఆయన కుమారుడే.

జగపతి ఆర్ట్స్ బ్యానర్ పై అనేక క్లాసికల్ సినిమాలను వి.బి.రాజేంద్ర ప్రసాద్ ను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎక్కువగా 14లను సినిమాలను రూపొందించారు. ‘దసరా బుల్లోడు’, ‘బంగారు బాబు’, ‘మంచి మనుషులు’, ‘ఆత్మబలం’, ‘పిచ్చిమారాజు’, ‘అందరు దొంగలే’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అక్కాచెళ్ళళ్లు’ ఇలా 30 సినిమాలకు పైగా నిర్మించారు. దర్శకుడిగా కూడా మంచి సినిమాలను తెరకెక్కించి అందరి మన్ననలు అందుకున్నారు. జగపతి బ్యానర్ పై నిర్మించిన తొలిచిత్రం ‘అన్నపూర్ణ’. వి.బి.రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘దసరా బుల్లోడు’.

సినిమా పరిశ్రమకు వి.బి.రాజేంద్ర ప్రసాద్ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. కెవి రెడ్డి మెమోరియల్ అవార్డు కూడా అందుకున్నారు. సినిమా పరిశ్రమ వి.బి.రాజేంద్ర ప్రసాద్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 123తెలుగు.కామ్ నివాళులు అర్పిస్తుంది.

Exit mobile version