చివరి షెడ్యూల్లో అనిల్ – భానుల ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్

Anil-Bhanu-Ventured
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ పబ్లిసిటీ డిజైనర్లు అనగానే గుర్తొచ్చే పేర్లు అనిల్ – భాను. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే బేధం లేదు. హీరోల ఎవరైనా వీరు డిజైన్ చేసిన పోస్టర్లు కంపల్సరీ. వీరు నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అపుడే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. జనవరి 18న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అనిల్ – భాను తెలిపారు.

ఈ సినిమా ద్వారా వెంకట్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ‘ఆరంజ్’ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ వద్ద, రామ్ గోపాల వర్మ ‘సత్య 2’, ‘నాట్ ఎ లవ్ స్టొరీ’, ‘డిపార్ట్మెంట్’ సినిమాలకు దర్శకత్వ విభాగంలో వెంకట్ కృష్ణ పని చేశారు. నేడు, జనవరి 14న అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా, వెంకట్ కృష్ణకు నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version