సేఫ్ జోన్లో ‘గోపాల గోపాల’ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు.

gopala-gopala
‘గోపాల గోపాల’ సినిమా కృష్ణా జిల్లాలో మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన విడుదలైన ఈ సినిమా నిన్నటికి సుమారు 2.30 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2.30 కోట్లకు కృష్ణా జిల్లా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. తొలి పది రోజుల్లో సినిమా ఇంచు మించు 2.30 కోట్లు కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఇకపై వచ్చే కలెక్షన్స్ లాభాలను తీసుకురానున్నాయి.

ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు, ఇతర ఏరియాలలో సైతం ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. త్వరలో 40 కోట్ల వసూళ్ళకు చేరువవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కిషోర్ పార్దసాని (డాలి) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు.

Exit mobile version