
నాగార్జున, కార్తిల కలయికలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ త్వరలో తెరలేవనుంది. తాజా సమాచారం ప్రాజెక్ట్ ఏప్రిల్ నుండి తన మొదటి షెడ్యూల్ మొదలుపెట్టుకుని దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమా ముఖ్య సన్నివేశాలను దుబాయ్ లోనే తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించనున్నారు.