
గత సంవత్సరం కంగన రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘క్వీన్’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో, అలాగే సౌత్ లాంగ్వేజస్ లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. రీమేక్ రైట్స్ తీసుకున్న రోజు నుంచి ఈ సినిమాలో కంగన పాత్ర చేయడానికి సరిపోయే పర్ఫెక్ట్ నటి కోసం త్యాగరాజన్ అన్వేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ పేరు తెరపైకి వచ్చాయి కానీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు.
మాకు అందిన తాజా న్యూస్ ప్రకారం త్యాగరాజన్ సౌత్ ఇండియన్ భాషలకి సరిపోయేలా ఒక హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమాని సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కానీ కంగన రనౌత్ స్థాయిలో ఎవరు చేయగలరా అనేదే ప్రశ్నార్ధకంగా మారింది. చూద్దాం మరి ఎవరు కంగన ప్లేస్ ని భర్తీ చేస్తారో..