కిక్ 2 లో చెన్నై ఎక్స్ ప్రెస్ విలన్

Niketan-Dheer
సురేందర్ రెడ్డి ‘కిక్ 2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం ప్రారంభమైన నాటినుండీ ఎదో ఒక కారణాన వార్తలలో నిలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రను హిందీ బ్లాక్ బస్టర్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో విలన్ గా నటించిన నికేతన్ దీర్ పోషించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో మనముందుకు రానుంది.

Exit mobile version