
హవీష్, అభిజిత్, నందిత నటినటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రామ్ లీల’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు చిన్నా సంగీతం అందించారు. ఈ సినిమాకి చెందిన షూటింగ్, నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆడియోని లాంచ్ చేసారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు.
ట్రై యాంగిల్ లవ్ స్టొరీలా అనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాని ఫిబ్రవరి 20న విడుదల చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ తరహా ప్రేమకథను తెరకెక్కించడం ఇదే మొదటిసారని, హవీష్, అభిజిత్ ల పాత్రలు చాలా బాగుంటాయని ఈ చిత్ర టీం అంటోంది. ఎస్. గోపాల్‌రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.
ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి