మెగా ప్రొడ్యూసర్ సరసన అమీ జాక్సన్

Udhayanidhi-Stalin-amy-jack

శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినా, కలెక్షన్ల విషయంలో వెనకడుగు వేసినా విక్రమ్ కష్టం వృధా అయినా ఆ సినిమాలో హీరోయిన్ అమీ జాక్సన్ కి మాత్రం బాగానే ఒపయోగపడింది. ఈ చిత్రం తరువాత ఈ భామకి భారీ ఆఫర్లు అందుతున్నట్టు సమాచారం. తాజాగా అమీ తమిళ నిర్మాత కమ్ నటుడు ఉధయనిధి స్టాలిన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 20నుండి జరగుతుంది. మాన్ కరాటే దర్శకుడు తిరుక్కుమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాదు. హారిస్ జయరాజ్ సంగీతదర్శకుడు. ఉదయనిధి స్టాలిన్ నిర్మాత. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

Exit mobile version