
సాయి ధరమ్ తేజ నటించిన రేయ్ సినిమా మొదటి చిత్రంగా ప్రారంభమైనా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని సమస్యలను చక్కదిద్దుకుని త్వరలో ఒక మంచి రిలీజ్ డేట్ చూసుకుని మనముందుకు రానుంది.
వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం మూడేళ్ళుగా ల్యాబ్ లో మగ్గిపోతుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. లక్కీగా సాయి రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంత ఒత్తిడి వుండకపోవచ్చు. ప్రస్తుతం సాయి, హరీష్ శంకర్ ల ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ నిర్మాణ దశలో వుంది.