వెనక్కు వెళ్ళిన బెల్లంకొండ – బోయపాటి శ్రీనుల సినిమా

boyapati-srinivas
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా తెరకేక్కిస్తుంది. నేడు అధికారికంగా ఈ సినిమా వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. బన్నితో బోయపాటి సినిమా అని వార్తలు రాగానే…. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన బెల్లంకొండ శ్రీనివాస్ – బోయపాటి శ్రీనుల సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. వాటికి దర్శకుడు చెక్ పెట్టారు.

అల్లు అర్జున్ సినిమా తర్వాత బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తాను. బన్ని సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బెల్లంకొండ సినిమా ప్రారంభిస్తాను అని దర్శకుడు బోయపాటి శ్రీను అఫీషియల్ ప్రెస్ నోట్ లో తెలిపారు.

ఈ స్టేట్మెంట్ తో ‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోయే రెండవ సినిమా అటకెక్కింది అనే వార్తలకు దర్శకుడు ఫుల్ స్టాప్ పెట్టినట్లే.

Exit mobile version