
ప్రేమికుల రోజు కానుకగా ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాని రిలీజ్ చేసిన యువ హీరో వరుణ్ సందేశ్ అప్పుడే మరో సినిమాని రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ సందేశ్ తొలిసారిగా ద్విపాత్రయభినయం చేస్తున్న సినిమా ‘లవకుశ’. జయశ్రీ శివన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వరుణ్సందేశ్ సరసన రిచా పనై, రుచి త్రిపాటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ రోజు లాంచ్ చేసారు. ఈ టీజర్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ఈ సినిమాని ఎక్కువ భాగం మలేషియాలో షూట్ చేసారు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి స్టార్ కమెడియన్ బాబు మోహన్ ‘లవకుశ’తో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేసి మార్చి చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. సత్య మోహన్ – ప్రకాష్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
లవ కుశ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి