
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు అని ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుందట. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. నిర్మాణ భాద్యతలు మాత్రమే చూసుకుంటూ దర్శకత్వం మరొకరి చేతుల్లో పెడతారనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా పవన్ కళ్యాణ్ – దాసరి కలయికపై ఎటువంటి ప్రకటన రాలేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత. ‘గబ్బర్ సింగ్ 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటివలే ‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీ(కిషోర్) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. దాసరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో..?