‘డైనమైట్’ గా రానున్న మంచు విష్ణు

vishnu
‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట డైరెక్షన్ లో వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న సంగతి మంకు తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమా కాన్సెప్ట్ తో పాటు, మంచు విష్ణు లుక్ కి సరిపోయేలా ‘డైనమైట్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా ప్రణిత నటిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version