మార్చి 5 నుంచి ఎన్.టి.ఆర్ – సుకుమార్ ల మూవీ

NTR_Sukumar1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఫిబ్రవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఎన్.టి.ఆర్ నెక్స్ట్ మూవీ సుకుమార్ డైరెక్షన్ లో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి మొదలు కానుంది. టెంపర్ సినిమా సక్సెస్ తో సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ పై మరింత కేర్ తీసుకున్నాడు. చాలా రోజుల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీని సుకుమార్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమా తండ్రీ – కొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపధ్యంలో సాగే సినిమా అని ఇది వరకే తెలిపాము. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా నటించనుంది. ప్రతి సినిమాలోనూ తన హీరోని డిఫరెంట్ గా చూపించే సుకుమార్ ఇందులో ఎన్.టి.ఆర్ ని కూడా ఓ డిఫరెంట్ లుక్ లో చూపించే ఆలోచనలో ఉన్నారు. ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

Exit mobile version