
యువ హీరో సుమంత్ అశ్విన్, తేజస్వి జంటగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కేరింత’. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ శబ్దాలయా థియేటర్లో జరుగుతున్నాయి.
కాలేజీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని సమాచారం. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘కేరింత’ను తెరకెక్కిస్తున్నారు. సినిమా రషెస్ చూసిన మూవీ యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే దీమాను వ్యక్తం చేశారు.
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి మాటల రచయిత. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మిక్కి యూత్ ఫుల్ బాణీలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని సమాచారం.