‘దోచేయ్’.. ట్రెండ్ సృష్టించే సినిమా!

DOCHAY
‘స్వామిరారా’ సినిమాతో ట్రెండ్ సృష్టించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘దోచేయ్’. నాగచైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ టీజర్, సాంగ్ టీజర్స్‌ సినిమాపై మంచి క్రేజ్ పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న (ఏప్రిల్ 10న) నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘స్వామిరారా’ సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాతోనూ మరోసారి ట్రెండ్ సృష్టిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ విభిన్న కథతో తెరకెక్కిన ఈ సినిమా తన కెరీర్‌కి మాత్రమే కాక తెలుగు సినీ పరిశ్రమకూ ఓ ప్రత్యేక సినిమాగా మిగిలిపోతుందని నాగచైతన్య అన్నారు. ఇదే వేడుకలో అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి తదితరులు పాల్గొన్నారు. దోచేయ్ సినిమాకు ఎమ్.ఆర్.సన్నీ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది.

Exit mobile version