రామ్ ‘శివం’లో హీరోయిన్‌గా ‘జిల్’ భామ?

Rashi-Khanna

గత కొంతకాలంగా సరైన హిట్‌లేని రామ్.. ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయాడు. ఆ కోవలో ఇప్పటికే ‘పండగ చేస్కో’ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అదేవిధంగా మరో రెండు సినిమాలు ‘శివం’, ‘హరికథ’లను ఇప్పటికే సెట్స్‌పైకి తీసుకెళ్ళాడు. ‘శివం’ షూటింగ్ రెండో షెడ్యూల్ ఈమధ్యే మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శ్రీనివాస్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నాడు. స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేది ఎవరనేది కన్‌ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు ‘జిల్’ సినిమా తర్వాత ఇటు యాక్టింగ్ పరంగానూ, అటు గ్లామర్ పరంగానూ తెలుగు సినిమాకు పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకున్న రాశి ఖన్నా రామ్ ‘శివం’లో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. ఇక రామ్ ‘శివం’, ‘హరికథ’ సినిమాల షూటింగుల్లో మునిగిపోగా ‘పండగ చేస్కో’ సినిమా మే నెల్లోనే విడుదల కానుంది.

Exit mobile version