
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమిన విషయాలు బయటకి వస్తూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం చిరు 150వ సినిమాని పూరి జగన్నాధ్ తో చేయనున్నాడని అనౌన్స్ చెయ్యగానే మెగా అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం నెలకొంది. అలాగే అప్పటి నుంచి ఆ సినిమా గురించి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా చిరు 150వ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఉతో జానీ అనే టైటిల్ ని పూరి రిజిష్టర్ కూడా చేసాడు.
తాజా వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడని అంటున్నారు. ఇదివరకే తెలియజేసినట్టు ఈ సినిమా 1940 – 50 బ్యాక్ డ్రాప్ లో ఓ పాత్ర, ప్రస్తుతం సమయంలో ఓ పాత్ర ఉండనుందని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరంజీవి చాలా రోజుల నుంచి చేస్తాడు అనుకుంటున్న ఉయ్యాలవాడి నరసింహా రెడ్డి పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతంలో ఉండే పాత్రే ఆటో జానీ అని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.