
యువ నటుడు మంచు మనోజ్ రేపు ఉదయం 9.05నిముషాలకు తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్ళు వేయనున్న సంగతి తెలిసినదే. వివాహమేకాదు రేపు మంచు మనోజ్ జన్మదినం కూడా కావడంతో ఆ రోజుని తాను జీవితాంతం గుర్తుంచుకునేలా తీర్చిదిద్దనున్నారు.
ఈ వేడుక వివరాలు 123తెలుగు ప్రత్యేకంగా మీకోసం అందిస్తుంది. ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందినా అతిరధమహారధులు అందరు ఈ యువజంటను ఆశీర్వదించడానికి వస్తున్నాడు. సౌత్ లోనేకాక భారతదేశంనుండి సెలబ్రిటీలు వస్తున్నట్టు సమాచారం.
ఇక 7రాష్ట్రాల గవర్నర్లు, ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, పలువురు క్యాబినెట్ మినిస్టర్లతో రాజకీయపరంగా కూడా ఈ వేడుక శోభాయమానంగా మారనుంది. దేశంలో వున్న బడా వ్యాపారవేత్తలు సైతం తరలిరానున్నారు. వీరందరి రాకను దృష్టిలో వుంచుకుని మంచు విష్ణు ఏకంగా 2500మంది గార్డ్ లను నియమించారు.
ఇక భోజనాల విషయానికి వస్తే అతిధులకు దేశవిదేశాలకు చెందిన అన్ని వంటకాలను రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ కోసం పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్ లను ఎంపిక చేసుకున్నారు. ఈ భాద్యతలన్నీ మంచు విష్ణు స్వయంగా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరగనంత అంగరంగ వైభవంగా ఈ వివాహం జరపడానికి కృషిచేస్తున్నారు. గత వారం రోజులనుండి మంచు వారింట్లో వివాహ మహోత్సవ వేడుక సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.