మరో మెగా హీరో సినిమాలో నదియా

Nadhiya-Moidu

1980లలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి నదియా.. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న నదియా ఈ మధ్యకాలంలో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె తెలుగులో చేసిన ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘దృశ్యం’ సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు నదియా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అది కూడా మెగా హీరో సినిమా కావడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నదియాని ఎంపిక చేసారు. ఎక్కువ భాగం రామ్ చరణ్ కి మదర్ పాత్రలో నదియా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తర్వాత మరో మెగా హీరోతో నదియా కలిసి చేస్తుండడం విశేషం. నిన్నటి నుంచే రామ్ చరణ్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్పెయిన్ లో మొదలైంది. అక్కడి అందమైన లోకేషన్స్ లో రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలకి శోభి మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపిస్తాడు. కృతి కర్భంద రామ్ చరణ్ కి సిస్టర్ గా కనిపించబోయే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version