
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ 9 ఏళ్ళు పాటు ఎంతో సోధించి, పరిశోధించి, శ్రమించి రాసుకున్న కథ రుద్రమదేవి. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవిత కథతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో అనుష్క కనిపించనుంది. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనుష్క పార్ట్ కి, అల్లు అర్జున్ పార్ట్ కి డబ్బింగ్ పూర్తి కాగా రానా పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ చివరి దశలో ఉంది.
మాకు అందిన సమాచారం ప్రకారం ఒక 5% తప్ప మిగిలిన డబ్బింగ్ పార్ట్ అంతా పూర్తయ్యింది. దాంతో గుణశేఖర్, అనుష్క కలిసి ఫైనల్ వెర్షన్ ని చెక్ చేస్తున్నారు. ఈ చెకింగ్ లో ఎక్కడన్నా కరెక్ట్ గా లేదు అనిపిస్తే మరోసారి డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ మిస్టేక్స్ ఏమీ లేకపోతే మరో కొద్ది రోజుల్లో రుద్రమదేవి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి. రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.