
హాట్ బ్యూటీ శృతి హాసన్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస క్రేజీ సినిమాల ఆఫర్స్ తో దూసుకెళ్ళిపోతోంది. అది కూడా ఒక్క భాషలో కాదు ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇటీవలే అక్షయ్ కుమార్ తో చేసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే హిందీలో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది శృతి హాసన్. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించనున్న నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అయిన తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘కలయన సమయల్ సాధం’ సినిమాకి రీమేక్ గా చేయనున్న సినిమా కోసం శృతిని ఓకే చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించనుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘శ్రీ మంతుడు(వర్కింగ్ టైటిల్)’ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన పులి సినిమాలో కూడా నటిస్తోంది.