‘బాహుబలి – ది బిగెనింగ్’లో పాటలెన్నో తెలుసా.?

baah-bali
టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ రేంజ్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్ళనున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా కోసం ఎస్ఎస్ రాజమౌళి గత రెండేళ్లుగా ఎంతో శ్రమించి తీస్తున్నాడు. మే 31న ఈ చిత్ర ట్రైలర్ మరియు ఆడియోని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాహుబలి టీం గ్రాండ్ ఆడియో లాంచ్ కోసం సన్నాహాలు చేస్తోంది. రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ కి ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే టైటిల్ ని ఫైనల్ చేసారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం ఎంఎం కీరవాణి అందించిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ఆడియోలో మొత్తం 8 పాటలు ఉండనున్నాయి. టాలీవుడ్ లో బాగా ఫేమస్ ఉన్న 7 మంది సాహిత్య రచయితలూ ఈ 8 పాటలని రాసారు. ఈ నెల 31న జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి బాలీవుడ్ లో డైరెక్టర్ గా, నిర్మాతగా, సక్సెఫుల్ రియాలిటీ షో హోస్ట్ గా, తాజాగా నటుడిగా మారిన కరణ్ జోహార్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ట్రైలర్ రిలీజ్ లోపు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో రోజు మార్చి రోజు ఈ చిత్ర టీం నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి జూలై 10న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version