
తమిళంలో స్టార్ హీరోగా ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ధనుష్ ఒక్క కొలవెరి డీ పాటతో ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత రాంజాన సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధనుష్ అభిమానులు పెద్ద పండుగ చేసుకునేలాంటి ఓ వార్త మీకు చెబుతున్నాను. అదేమిటంటే ధనుష్ ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాకి సంబదించిన చర్చల్లో ఉన్నాడు. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ సినిమాకి సైన్ చేస్తాడు. ఫ్రెంచ్ – ఇరానియన్ లేడీ ఫిల్మ్ మేకర్ అయిన మార్జనే సత్రపి చేయనున్న ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఇయా వార్డ్రోబ్’ సినిమా కోసం ధనుష్ తో సంప్రదింపులు జరపనున్నారు.
ఇంగ్లీష్ లో అత్యధికంగా సేల్ అయిన ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఇయా వార్డ్రోబ్’ నవలా ఆధారంగా అదే టైటిల్ తో ఈ ఫ్రెంచ్ సినిమా చేయనున్నారు. ఈ వార్తని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మార్జనే సత్రపి తెలియజేశాడు. ఒక మోసగాడైన కుర్రాడు న్యూ ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ వరకూ చేసిన అడ్వెంచరస్ జర్నీనే ఈ సినిమా కథ. ఈ జర్నీలో ఆ కుర్రాడు పర్షియన్ అమ్మాయితో ప్రేమలో పడి ఏం చాసాడు అన్నది కూడా కథలో ఉంటుంది. మార్జనే సత్రపి ఫ్రెంచ్ – ఇరానియన్ లో తెరకెక్కించిన పెర్సేపోలిస్ అనే యానిమేషన్ ఫిలిం 80వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు గెలుచుకుంది. అన్నీ కుదిరితే ధనుష్ హాలీవుడ్ ఫిల్మ్ త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.