జోరుగా నాగశౌర్య ‘జాదూగాడు’ ప్రమోషన్స్!

jadugadu
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య. తాజాగా నాగశౌర్య ‘జాదూగాడు’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనారిక బదోరియా కథానాయికగా నటించింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు అంతటా మంచి స్పందన వస్తోంది. ఆడియో సక్సెస్‌తో జోష్ మీదున్న యూనిట్ వరుసగా ప్రమోషన్లు చేసుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. హీరో నాగశౌర్య, హీరోయిన్ సోనారిక, సంగీత దర్శకుడు సాగర్ మహతి ఇలా సినిమా యూనిట్ మొత్తం కలిసి ఎఫ్.ఎం. స్టేషన్లలో, టీవీ చానల్లలో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖర్లోనే సినిమాను విడుదల చేయాలన్న ఆలోచనలో నిర్మాత ఉన్నారు.

Exit mobile version