ఆగష్టుకి నితిన్ సినిమాను పూర్తిచేయనున్న పూరి?

nithin-purijaganth
అతితక్కువ సమయంలో సినిమాలను పుర్తిచెయ్యగలిగే స్టామినా సౌత్ లో రామ్ గోపాల్ వర్మ తరువాత పూరి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చిరు 150వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంటూనే తానూ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నిర్మాణాంతర పనులను చూసుకుంటున్నాడు. చిరు సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలయ్యే సూచనలు వున్నాయి.

తాజా సమాచారం ప్రకారం చిరు సినిమా మొదలెట్టేకంటే ముందే మరో యువహీరో తో ఒక ప్రాజెక్ట్ పుర్తిచేయ్యాలని ఉవ్విళ్ళురతున్నాడు. యువ నటుడు నితిన్ తో ఒక సినిమా తీస్తానని మాటిచ్చిన పూరి జ్యోతిలక్ష్మి పనులు పూర్తయ్యాక నితిన్ సినిమాను మొదలుపెట్టి ఆగష్టుకల్లా సినిమాను పూర్తిచేస్తాడట. ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చదువుతూ వుండండి.

Exit mobile version