చక చకా సినిమాలు చేసే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి బ్యాంకాక్ అంటే ఎంత ఇష్టమో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ రాసే ప్రతి సారిఎక్కువ టైం బ్యాంకాక్ లోని బీచ్ ఏరియాలో గడుపుతారు. ప్రతి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడానికి ముందు పూరి బ్యాంకాక్ వెళ్లి అక్కడ స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకొని వస్తాడు. ముఖ్యంగా ఆ బీచ్ లో కూర్చొని డైలాగ్ వెర్షన్ ని ఫినిష్ చేస్తాడు.
ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న 150వ సినిమా కోసం డైలాగ్స్ రాయడం కోసం బ్యాంకాక్ కి వెళ్ళాడు. గత కొద్ది రోజులుగా పూరి బ్యాంకాక్ లో చిరు సినిమా కోసం పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టొరీ మొత్తం పూర్తవ్వడం, దానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమాకి ఆటోజానీ అనే టైటిల్ ని కూడా లాక్ చేసారు. చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఈ సినిమాని లాంచ్ చేయనున్నారు. ఇది కాకుండా పూరి డైరెక్ట్ చేసిన ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
