‘బాహుబలి’ ఆడియోలో ‘ఈగ’ మానియా

Nani1
టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాఫిక వండర్ మరియు పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ మే 31న గ్రాండ్ గా జరగనుంది. ఈ ఆడియో లాంచ్ ని చాలా గ్రాండ్ గా జరపడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తోంది. ఈ బాహుబలి ఆడియో లాంచ్ కోసం ఈగ హీరో అయిన నానిని రంగంలోకి దింపారు. నాని బాహుబలి ఆడియోలో యాంకర్ గా వ్యవహరించనున్నాడు. ‘ బాహుబలి ఆడియోలో యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్న ఈగకి చాలా థాంక్స్’ అని రాజమౌళి ట్వీట్ కూడా వేసాడు.

మే 31న జరగనున్న ఈ బాహుబలి ఆడియో లాంచ్ కోసం సిటీలోనే అతిపెద్ద వేదికని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. చాలా గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యింది. దాంతో ఈ చిత్ర టీం మొత్తం ఆడియో లాంచ్ మునుపెన్నడూ లేని విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదలా ఉంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న ఈ సినిమా రిలీజ్ కోసం జూలై 10ని లాక్ చేసారు.

Exit mobile version