ఊటీకి చేరిన రామ్ ‘శివం’

ram
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవలే ‘పండగ చేస్కో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా పూర్తవ్వక ముందే రామ్ మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అందులో మొదటిది సురేందర్ రెడ్డి అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా ‘శివం’. ఈ సినిమాలో రామ్ సరసన రాశీ ఖన్నా జోడీ కడుతోంది. జూన్ 12 వరకూ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొని క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం ఊటీకి చేరింది. మరో వారం రోజుల పాటు ఊటీలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

ఈ వారం రోజులపాటు రామ్, రాశీ ఖన్నా, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ ఊటీ షెడ్యూల్ తో శివంకి సంబందించిన 70% షూటింగ్ పూర్తవుతుంది. స్రవింతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. రామ్ ఇది కాకుండా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో హరికథ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Exit mobile version