మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో మెగాస్టార్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. మెగా ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారట. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో మెగాస్టార్ తో పాటు నలభై మంది ఫైటర్స్ కూడా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తారట.
అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.
