
ఇండియాలోనే మొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదాటగా ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే ఫస్ట్ పార్ట్ ని జూలై 10న రిలీజ్ చెయ్యనున్నారు. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ దగ్గర అపడుతున్న కొద్దిఈ ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
ఈ సినిమా హిందీ వెర్షన్ ని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్న విషయం ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం బాహుబలి సినిమా హిందీ వెర్షన్ స్పెషల్ ప్రీమియర్ షోని జూలై 9వ తేదీన ప్లాన్ చేసారు. ఈ ప్రీమియర్ షో కి బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా ఈ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కానున్నారు. ఈ విషయంతో బాహుబలి సినిమా కచ్చితంగా జూలై 10న రిలీజ్ అవుతోందని మరోసారి తెలియజేశారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం త్వరలోనే హై రేంజ్ ప్రమోషన్స్ చెయ్యడానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిచాడు.