
టాలీవుడ్ భారీ బడ్జెట్ మరియు మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రెండేళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా చెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని ముంబైలో మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా బాహుబలి కోసం తను చాలా కష్టం అనిపించింది కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఈ సినిమా చేసానని చెప్పింది.
‘రాజమౌళి కథ చెప్పిన రోజు మరియు షూటింగ్ స్పాట్ లో ప్రతి రోజు కొత్త అనుభవాల్ని ఫేస్ చేసాను. నా కెరీర్లో మొదటి సారి ఈ సినిమా కోసం పోరాట సన్నివేశాలు, రోప్ వర్క్స్ సీన్స్ చేసాను. ప్రభాస్ పక్కన నిల్చోవాలి అంటే హైట్ ఇబ్బందులు వచ్చాయి. కొన్ని సార్లయితే స్టూల్ కూడా వేసారు. రాజుల బచ్క్ డ్రాప్ మూవీ కాబట్టి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. చాలా కష్టమైంది కానీ ఇలాంటి సినిమాలో నేను నటిస్తున్నాను అనే ఫీలింగ్ తో ఎంతో ఇష్టంగా ఈ సినిమా చేసానని’ తమన్నా అంటోంది. బాహుబలి సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా అన్నదమ్ములుగా కనిపించనున్నారు.
ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.