ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్!

Rajendra-Prasad-Ntr-jr
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తరువాతి చిత్రం కోసం మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌తో జత కట్టిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాని అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ పాత్ర ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ చేయనున్నట్లు సమాచారం. ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తండ్రి పాత్ర కీలకమైనది కావడంతో రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..’ అన్న టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

Exit mobile version