ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తాజాగా జరిగిన ఈ వేడుకలో చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా సందడి చేశారు. సునీల్ నారంగ్‌తో చిరంజీవికి ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా ఆయన ప్రత్యేకంగా విచ్చేసి నూతన దంపతులతో ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
