డిఫరెంట్ గెటప్స్ లో బాహుబలి ప్రీ రిలీజ్ పార్టీ

baahubali-team
టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా ఈ చిత్ర టీం టెన్షన్స్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం గత రాత్రి బాహుబలి టీం ఓ సూపర్బ్ ఫన్ ఉన్న ఓ ప్రీ రిలీజ్ పార్టీ చేసుకున్నారు. అది కూడా చాలా రెగ్యులర్ గా కాకుండా కామిక్ కాన్ స్టైల్ లో సూపర్ హీరోస్, ఫేమస్ యానిమేషన్స్ గెటప్స్ వేసుకొని పార్టీలో ఎంజాయ్ చేసారు.

ఈ పార్టీలో అనుష్క కాట్ ఉమెన్ గెటప్లో, నిర్మాత శోభు యార్లగడ్డ బాట్ మెన్ గెటప్లో, నాని ఈగ మాన్ గెటప్లో, రాజమౌళి తనయుడు కార్తికేయ హనుమంతుడి గెటప్ లో సందడి చేసారు. వీరితో పాటు ఈ పార్టీలో పాల్గొన్న రానా, ప్రసాద్ దేవినేని, క్రిష్, రాఘవేంద్ర రావు, ప్రకాష్ కోవెలమూడి, రమా రాజమౌళి, శ్రీ వల్లి తదితరులు కూడా పలు గెటప్స్ లో వచ్చారు. ఈ పార్టీకి కెప్టెన్ రాజమౌళి, హీరో ప్రభాస్ మిస్ అయ్యారు. జూలై 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబందించిన అన్ని కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Exit mobile version