కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే “కరుప్పు”. తెలుగులో కూడా ఇదే పేరిట విడుదలకి తీసుకొస్తున్న ఈ సినిమా రిలీజ్ ని ఈ మే 15కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొన్నామధ్య సినిమా పోస్టర్స్ లో మేకర్స్ డేట్ ని మిస్ చేయడంతో దళపతి విజయ్ జన నాయగన్ వచ్చే ఛాన్స్ ఉందని మిస్ చేశారనే టాక్ వచ్చింది.
కానీ ఇప్పుడు మేకర్స్ మాత్రం అనుకున్న టైం లోనే సినిమాని తెస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు ఆర్జే బాలాజీ ప్రస్తుతం కరుప్పు సాలిడ్ ట్రైలర్ కట్ పనుల్లో ఉన్నామని మే 14న సినిమా థియేటర్స్ లో విడుదల కానున్నట్టు ఖరారు చేసాడు. సో సూర్య సినిమా విషయంలో రూమర్స్ నిజం కాదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సూర్య చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేస్తుండగా అభిమానులు ఈ సినిమాతో అయినా తమ హీరో కంబ్యాక్ కొట్టాలని చూస్తున్నారు.
Trailer is getting cooked… Serving soon !!!🔥❤️🔥 #Karuppu from May 14th 🖤💣 pic.twitter.com/ufEft6OGK4
— RJ Balaji (@RJ_Balaji) May 3, 2026
