ఒక్క పాట వెనుక 70రోజుల మధనం

BAAHUBALI
బాహుబలి ఆడియో విన్న ప్రతీ ఒక్కరికీ ‘పచ్చ బొట్టేసినా’ పాట ఎందుకో కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. చాలా చిన్న చిన్న పదాలలో పెద్ద పెద్ద భావాలను అందించడంలో ఈ పాట సఫలీకృతమయ్యింది. ఇంత అందమైన సాహిత్యాన్ని యువ రచయిత అనంత్ శ్రీరాం అందించడం విశేషం.

దాదాపు 650పాటలకు పైగా రచించిన అనంత్ శ్రీరామ్ తన కెరీర్ లో ఇది మరపురాని పాటని తెలిపాడు. 70రోజుల మధనం తరువాత వచ్చిన పాటని, ఈ పాటలో తనకిష్టమైన రచయితలకు జ్ఞాపకంగా సిరివెన్నల, హల వంటి పదాలను వాడినట్టు తెలిపాడు. ఇటీవల మంచి ఆదరణ పొందిన నీ చితిలో తోడై నేనోస్తానమ్మ అన్న అర్ధాలను స్పృశించేలా ఈ పాటలో రెండు వాక్యాలను రాసినట్టు తెలిపాడు.

Exit mobile version