‘దృశ్యం’ రీమేక్‌ను రజనీ ఎందుకు కాదన్నాడంటే..!

rajinikanth
కమల్ హాసన్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా ‘పాపనశం’. తమిళనాట భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాకు రీమేకే ఈ పాపనశం. ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన దృశ్యం కాన్సెప్ట్ తమిళంలోనూ మంచి విజయం దిశగా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మొదట్లో ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళ రీమేక్‌కు రజనీకాంత్‌ను సంప్రదించగా.. పోలీసులు రజనీ పాత్రను కొట్టే సన్నివేశం, క్లైమాక్స్ తనకు నప్పవని ఆ సినిమాను రజనీ వదిలేశారట. ఇక రజనీ అభిప్రాయానికి దర్శకుడు కూడా అంగీకరించి కమల్ హాసన్‌తో పాపనాశం పేరుతో దృశ్యం రీమేక్ చేశారు. ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాడడం నేపథ్యంలో తెరకెక్కిన ‘పాపనశం’ మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇక చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Exit mobile version