తమిళనాడులో ‘బాహుబలి’కి మరిన్ని థియేటర్లు!

baahubali-b

సగటు సినీ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’.. నిన్న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను చాలా ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.

అన్ని భాషల్లో కలుపుకొని సుమారు 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్లా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళ నాడులో ఓ పెద్ద హీరో సినిమా స్థాయిలో ఈ సినిమాకు థియేటర్లు లభించడం విశేషం. ఇక నిన్న తమిళనాట ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండోరోజు నుంచి మరిన్ని థియేటర్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 400 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా జతికలిసే థియేటర్లతో కలుపుకొని మంచి ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టే సూచనలున్నాయి. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తమిళనాట విడుదల చేసిన విషయం తెలిసిందే!

Exit mobile version