‘బాహుబలి’ తూగో జిల్లా రికార్డ్ – 3 రోజులలో మూడున్నర కోటి

Baahubali
మూడేళ్ళు ఎంతో కష్టపడి ఇది వరకూ లేని, మనకు తెలియని ఓ మాహిష్మతి అనే రాజ్యాన్ని క్రియేట్ చేసి తెలుగుతో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళిన సినిమా ‘బాహుబలి’. కనీవినీ ఎరుగని భారీ సెట్స్, వార్ ఎపిసోడ్స్ మరియు సూపర్బ్ విజువల్స్ తో బాహుబలి సినిమా ఆడియన్స్ ని థ్రిల్ చేయడమే కాకుండా సరికొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో బాహుబలి సినిమా తూర్పు గోదావరిలో ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజుల్లో రూ. 2,68,81,916 కోట్లు షేర్ సాధించిన ఈ సినిమా మూడవ రోజుతో మూడున్నర కోటి కలెక్ట్ చేసి రికార్డ్ నెలకొల్పింది.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో మూడవ రోజు రూ. 79,75,498 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా మూడు రోజుల్లో మొత్తంగా రూ. 3,48,65,786 కోట్ల షేర్ సాధించింది (మొదటి రోజు 1.97 కోట్లు, రెండవ రోజు రూ. 72,13,561కోట్లు). మొదటి మూడు రోజుల్లో ఈస్ట్ గోదావరిలో ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. వీక్ డే అయిన ఈ రోజు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని, ఈ రోజు మంచి నెంబర్స్ రికార్డ్ అవుతాయని అంటున్నారు. ఓవర్సీస్ నుంచి లోకల్ ఏరియాల వరకూ ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రతి ఏరియాలోనూ ఓల్డ్ రికార్డ్స్ ని తిరగరాస్తోంది.

ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ మార్క్ కి ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల స్టార్ పవర్ తోడవడంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి సినిమాకి సంబందించిన ఒరిజినల్ కలెక్షన్ రిపోర్ట్స్ కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version