
ఒకే ఒక్క నిమిషం చేసిన అతిధి పాత్రతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న అక్కినేని యువ తరంగం అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమా చివర్లో ప్రేక్షకులకు ఓ కొత్త కిక్ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అఖిల్ తన ఫస్ట్ మూవీ టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇప్పటికే 70% షూటింగ్ దాకా పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు మేకింగ్ వీడియోస్ ద్వారా అఖిల్ అంచనాలను మరింత పెంచేసాడు. దీంతో ఈ సినిమాకి బిజినెస్ పరంగా సూపర్బ్ క్రేజ్ నెలకొంది.
ప్రతి ఏరియా నుంచి ఈ సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. అఖిల్ కి ఇది మొదటి సినిమా అయినా స్టార్ హీరో సినిమాలా రైట్స్ కోసం క్రేజ్ నెలకొంది. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అఖిల్ సినిమాకి సూపర్బ్ క్రేజ్ ఉంది. అందుకే ఓ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమారు 6 కోట్లకి పైనే పెట్టి ఈ సినిమా రైట్స్ తీసుకోవాలని నిర్మాతలని అప్రోచ్ అయ్యారని సమాచారం. డెబ్యూ మూవీ అయినా అఖిల్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుండడం నిర్మాతలకి ఆనందాన్ని ఇస్తోంది. అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా ద్వారా అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.