‘బాహుబలి 2’కథలో రాజమౌళి మార్పులు.!

rajamouli
ఇన్ని రోజులు సౌత్ కి మాత్రమే తెలిసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గత కొద్ది రోజులుగా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. బాహుబలి సినిమా అందరి మన్ననఆరంతాలు పొందడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టించింది. ఈ సినిమా చూసిన సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి బాలీవుడ్ టాప్ క్రిటిక్ అయిన రాజీవ్ మసంద్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి బాహుబలి 2 గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు. ముఖ్యంగా అవసరం అయితే బాహుబలి 2 కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తా అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ ‘సినిమా రిలీజ్ అవ్వగానే వచ్చిన రెస్పాన్స్ ని బట్టి కథలో మార్పులు చేయలేం. మొదటి వారంలో అందరి నుంచీ వచ్చిన ఫీడ్ బ్యాక్ సూపర్బ్, మాకు మేమే పొంగిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాన్ని బట్టి బాహుబలి 2 కథలో మార్పులు చేయలేం. నాకు తెలిసి అసలైన టాక్ 4వ వారం పైన వస్తుంది. అప్పుడే మనకు కచ్చితమైన టాక్ బయటకి వస్తుంది. అందుకే నేను జెన్యూన్ ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఫీడ్ బ్యాక్ ని బట్టి అవసరం అయితే పార్ట్ లో మార్పు చేస్తానని’ చెప్పాడు. ఇప్పటి వరకూ 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది.

Exit mobile version