
తన కెరీర్ లో కలెక్షన్ల పరంగా ‘అసుర’ మంచి విజయం సాధించడంతో నారా రోహిత్ విజయానందంలో వున్నాడు. ఇటీవల వరుసపెట్టి కొత్త ప్రాజెక్ట్ లలో సంతకం చేస్తూ వచ్చిన రోహిత్ ఆ జాబితాలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ దర్శకుడు పవన్ సాదినేని పేరు కూడా చేర్చాడు.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ నుండి మొదలుకానుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన నందిత నటించనుంది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్ సరసన శంకరాభరణం సినిమాలో నటిస్తుంది.
ఈ చిత్రానికి సావిత్రి అనే టైటిల్ ని ఖరారు చేసారు. సరికొత్త లుక్ లో నారా రోహిత్ దర్శనమివ్వనున్నట్టు సమాచారం .