విశాల్ సినిమాలో విలన్‌గా సత్యరాజ్?

Satya-Raj

దర్శకుడు రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ మాయలో పడ్డ సినీ అభిమాని ఇంకా అదే మాయలో ఉన్నాడన్న విషయాన్ని సోషల్ మీడియా ఋజువు చేస్తూనే ఉంది. ఇదే సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడుతున్న ప్రస్తావన, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే విషయం. అంతగా ఆ సన్నివేశంతో సెకండ్ పార్ట్‌కు క్యారీ చేసిన సస్పెన్స్ ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంది. ఇక కట్టప్ప పాత్ర, ఈ పర్టిక్యులర్ సన్నివేశం సినిమాలో నిలిచిపోవడానికి రాజమౌళి విజన్ ఎంతగా ఉపయోగిపడిందో, కట్టప్పగా నటించిన సత్యరాజ్‌ నటనా అదే స్థాయిలో ఉపయోగపడింది.

తన విలక్షణ నటనతో చాలా సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సత్యరాజ్ బాహుబలి విజయంలోనూ తనదైన మార్క్ చూపించారు. ఇక బాహుబలి తర్వాత సత్యరాజ్‌ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట. ఆ కోవలోనే లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందుతోన్న పందెం కోడి సినిమాలో సత్యరాజ్‌ను విలన్ పాత్రకు సంప్రదించారట. సెప్టెంబర్ నుంచి మొదలుకానున్న ఈ సినిమాకు సత్యరాజ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే.. త్వరలోనే మొదలుకానున్న బాహుబలి పార్ట్ 2 కోసం కూడా సత్యరాజ్ ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేసేశారు.

Exit mobile version