మే 22న ‘అగ్లీ స్టోరీ’ విడుదల.. ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సాగర్ కె చంద్ర

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ థియేట్రికల్ ట్రైలర్‌ను ‘భీమ్లా నాయక్’ ఫేమ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర తాజాగా విడుదల చేశారు. ప్రేమలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంటెన్స్ నెరేషన్, ఊహించని ట్విస్టులు, బలమైన ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాషిణి, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ప్రణవ మాట్లాడుతూ.. ప్రతి ప్రేమకు ఉండే చీకటి కోణాన్ని ఇందులో బలంగా చూపించామన్నారు. ఈ పాత్ర తనకు కొత్త ఛాలెంజ్ అని హీరో నందు తెలపగా, ప్రేమలోని వాస్తవాలను ఈ చిత్రం ద్వారా చూపించామని అవికా గోర్ పేర్కొన్నారు.

సినిమా అవుట్‌పుట్ పట్ల నిర్మాతలు సుభాషిణి, లక్ష్మణ్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు సహకారం అందించిన బెక్కం వేణుగోపాల్‌కు, సాగర్ కె చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించిన సాగర్ కె చంద్ర, సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version