ఫస్ట్ మూవీతోనే అఖిల్ 50 కోట్ల రికార్డ్

Akhil

టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అయిన వివి వినాయక్ అక్కినేని నవతరం నటవారాసుడు అక్కినేని అఖిల్ ని హీరోగా తెలుగు పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా బిజినెస్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం వరుసగా సెన్సేషనల్ రేట్స్ కి అఖిల్ మూవీ అమ్ముడు పోతోంది. నైజాంలో 13 కోట్లు, కృష్ణా జిల్లా 2.5 కోట్లకి అమ్ముడు పోతే సీడెడ్ లో సుమారు 7 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యేలా ఉంది.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం నుంచి మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం అఖిల్ కి ఇది ఫస్ట్ సినిమా అయినా ప్రతి ఏరియాలోనో బెస్ట్ ప్రైస్ కి అమ్ముడు పోతున్నాయని తెలిపారు. అలాగే ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 55 కోట్లని టచ్ చేస్తుందని అంటున్నారు. అఖిల్ కి ఇది మొదటి సినిమా అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో వస్తుండడంతో అందరూ షాక్ ఉన్నారు. అలాగే మొదటి సినిమాతోనే 50 కోట్ల బిజినెస్ చెయ్యడం ఓ రికార్డ్ అని అంటున్నారు. ఈ చిత్ర టీం చివరి షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ మొత్తం పూర్తవుతుంది.

అఖిల్ – సయేషా సైగల్ హీరో – హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version