
యంగ్ హీరో విశాల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘పందెం కోడి’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో డైరెక్టర్ లింగు స్వామి ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. బాలనటి మరియు ఓయ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన బేబీ షామిలి హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి.
తాజాగా డైరెక్టర్ లింగు స్వామి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘హీరోయిన్ పాత్ర కోసం మేము బేబీ షామిలిని అప్రోచ్ అవ్వలేదు. మా టీం ప్రస్తుతం అక్షర హాసన్ తో చర్చలు జరుపుతోంది, కానీ ఇంకా ఫైనలైజ్ కాలేదని’ తెలిపాడు. దీని ప్రకారం అన్ని వర్కౌట్ అయితే విశాల్ సరసన అక్షర హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. తమిళ స్టార్ సత్యరాజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. పందెం కోడి హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.