తమిళనాట అదే జోరు కొనసాగిస్తోన్న ‘బాహుబలి’!

baahubali
విడుదలై మూడో వారమైనా ‘బాహుబలి’ తన రికార్డుల పరంపరను అలా కొనసాగిస్తూ దూసుకుపోతూనే ఉంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన నాటినుంచే అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం కూడా అదే ఊపుతో కొనసాగిస్తోంది. తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోయినా తమిళం, హిందీల్లో మాత్రం పలు పెద్ద సినిమాలు బాహుబలి ఊపును తగ్గిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమైనా, వాటన్నింటికీ భిన్నంగా సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అన్నిచోట్లా స్ట్రాంగ్‌గా నిలబడింది.

కోలీవుడ్‌లో అక్కడి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ‘బాహుబలి’ టాప్‌లో నిలవడం విశేషం. మూడో వారాంతం కూడా అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ బాహుబలి, భారీ అంచనాల మధ్య విడుదలైన ధనుష్ మారి సినిమాను దాటి చెన్నైలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక వీక్ డేస్‌లో కూడా అదే జోరు కొనసాగడం ఆసక్తికరంగా మారింది. నిన్న సోమవారం దాదాపుగా 70-80% ఆక్యూపెన్సీతో నడిచిన బాహుబలి థియేటర్లు నేడు కూడా అదే స్థాయిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా లామ్గ్ రన్‌ ఎప్పటివరకు ఉంటుందనేది ఆసక్తికరం అశం.

Exit mobile version